అలాంటి తప్పు చేసి హిట్ సినిమాలను వదులుకున్న పవన్ కళ్యాణ్..!!

-

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరకు కొంతమంది దర్శకులు కథ చెప్పే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ఏమిటంటే నిద్రపోవడం.. అలా నిద్రపోయి సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్న సందర్భాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా కథ పవన్ కళ్యాణ్ కి చెబుతున్న సమయంలో పవన్ నిద్రపోయారట. దీంతో ఆ కథల్ని మహేష్ బాబుకు చెప్పి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మరొక డైరెక్టర్ క్రిష్ పవన్ తో అన్ స్టాపబుల్ -2 షో లో పాల్గొన్నప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఎవరైనా కథ చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ నిద్రపోతారు అంటూ తెలియజేశారు క్రిష్. అలాగే గతంలో కూడా పూరీ జగన్నాథ్ ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలను కూడా ముందుగా పవన్ కళ్యాణ్ తో తీయాలి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాటిని రిజెక్ట్ చేయడంతో రవితేజకు ప్లస్ అయ్యింది.

ఇక మరొకసారి పూరి జగన్నాథ్ పోకిరి సినిమాని చెప్పినప్పుడు కూడా ఇలాగే నిద్రపోయినట్లు సమాచారం. అలా మరొక సినిమా గోలీమార్, మిరపకాయ్ ,నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూసుకెళ్తా ,ఆటోనగర్ సూర్య తదితర చిత్రాలు ఉన్నట్లుగా సమాచారం. ఇందులో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నవే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో దాదాపుగా ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version