11 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న 16లక్షల మంది భారతీయులు.. కేంద్రం నివేదిక

-

ఇటీవల కాలంలో భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2011 నుంచి దేశంలో 16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం 2022లోనే 2.25లక్షల మంది పౌరసత్వాన్ని త్యజించినట్లు పేర్కొంది. ఒకే ఏడాదిలో ఇంతమంది పౌరసత్వాన్ని వదులుకోవడం ఇదే తొలిసారి కాగా 2020లో ఈ సంఖ్య అతితక్కువగా ఉందని చెప్పింది.

ప్రతి ఏటా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్యకు సంబంధించిన వివరాలను విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2015లో 1.31లక్షలు, 2016లో 1.41లక్షలు, 2017లో 1.33లక్షలు, 2018లో 1.34లక్షలు, 2019లో 1.44లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపారు.

2020లో అతి తక్కువగా 85వేల మంది తమ సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నారని చెప్పారు. కాగా 2021లో 1.63లక్షల మంది, 2022లో అత్యధికంగా 2,25,620 మంది పౌరసత్వాన్ని విడిచిపెట్టారన్నారు. మొత్తంగా 2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల 60వేల మంది ఇండియన్‌ సిటిజెన్‌షిప్‌ను వదులుకున్నారని విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version