ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియా ముందుకు రానున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మాట్లాడనున్నారు. సింగపూర్ లో ఉంటున్న మార్క్ శంకర్ అక్కడి స్కూల్ లో చదవుకుంటున్నాడు. అయితే ఇవాళ ఉదయం ఆ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ గాయపడ్డాడు.
ఆగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ బయల్దేరారు. అయితే పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలుసుకున్న జనసైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నాయకుడు, హీరో కుమారుడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. కొందరు జనసేన నేతలు గుడికి వెళ్లి మార్క్ శంకర్ పేరిట పూజలు కూడా చేయించారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్యం పరిస్థితిని వివరించేందుకు కాసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రానున్నారు.