వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే చిన్న చిన్న మార్పులు శరీరంలో జరగడం వలన ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఎంతో ప్రభావం చూపుతాయి. పాదాలు వాపు వంటివి వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు. అయితే ఇటువంటి వాటికి డాక్టర్ ను సంప్రదించాలని అనుకుంటారు. కాకపోతే ఇటువంటి సమస్యలు తీవ్రంగా ప్రమాదం చూపవు. కనుక కొన్ని చిట్కాలను పాటించి వాటిని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చుంటారో, పాదాలు వాపు వస్తాయి.
అంతేకాకుండా గాయాలు లేక మూర్చ రావడం, గర్భధారణ వంటి మొదలైన సమస్యలకు సంబంధించిన మందులను ఉపయోగించడం వలన కాళ్లు వాపు ఉంటాయి. సహజంగా వీటి ప్రభావం ఆరోగ్యం పై ఎక్కువగా ఉండకపోయినా, కొన్ని సందర్భాలలో పాదాల వాపు మూత్రపిండాలు లేక కాలేయ సమస్యలకు లక్షణాలుగా కనబడతాయి. కనుక కేవలం సాధారణ కారణాల వల్లనే పాదాలు వాపు వస్తే ఈ చిట్కాలను పాటించవచ్చు. ఎప్పుడైతే పాదాలు వాపు ఎదురవుతుందో వాపును తగ్గించడానికి కంప్రెషన్ స్టాకింగ్స్ ను ధరించాలి. వీటిని ఉపయోగించడం వలన మోకాళ్ల పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనితో రక్త ప్రవాహం జరుగుతుంది మరియు శరీరంలో ఉండే ద్రవాలు పెరుగుతాయి.
ఈ విధంగా పాదాలలో వాపు తగ్గుతుంది. పాదాల వాపును ఎదుర్కొన్నప్పుడు దానిని వెంటనే తగ్గించవచ్చు. ఎంతో త్వరగా ఉపశమనం పొందాలంటే ఎప్సం సాల్ట్‌ను ఉపయోగించి నీటిలో కాళ్లను పెట్టాలి లేదా గోరువెచ్చని నీటిని తీసుకొని ఎప్సం సాల్ట్ కలిపి 20 నిమిషాల పాటు అందులో ఉంచండి. ఇలా చేయడం వలన పాదాల వాపు తగ్గుతుంది. ఐస్ ప్యాక్ లేక ఐస్ బాత్ వంటివి కూడా పాదాల వాపును తగ్గించడానికి సహాయం చేస్తాయి. వీటిని ఉపయోగిస్తే రక్తనాళాలను సంకోచింప చేస్తాయి. ఈ విధంగా రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో కాళ్ల వాపు కూడా తగ్గుతుంది.