Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ గురించి…ఆయన నటించిన సినిమాల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేనకు మద్దతు తెలిపిన నర్సపురం ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభాస్ అంటే తనకు చాలా అభిమానం అని.. ప్రభాస్ నటించిన బాహుబలి, ఆది పురుష్ చేసిన సరే రోజుకు 500 నుంచి 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తారు. టాక్స్ లు కడతారు. ఈ జగన్ ప్రభాస్ ల నీతిగా సంపాదించాడు. కానీ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వాక్యాలకు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.