ఆర్ఆర్ఆర్ విడుద‌ల నిలిపివేయాలని పిటిషన్.. హై కోర్టు కీల‌క తీర్పు

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా వ‌స్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థీయేట‌ర్స్ ల‌లో విడుద‌ల అవుతుంది. అయితే ఈ సినిమా విడుద‌లను ఆపాల‌ని కొంత మంది తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో ప్రజా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. అల్లూరి సీత‌రామ రాజు, కుమురం భీం పాత్ర‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారని పిటిషన్ లో తెలిపారు.

వారి పేరు, ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించేల ఆర్ఆర్ఆర్ సినిమా ఉండ‌బోతుంద‌ని.. అందుకే ఆ సినిమా విడుద‌ల ఆపాల‌ని హై కోర్టుల కోరారు. కాగ ఈ పిటిషన్ మంగ‌ళ‌వారం హై కోర్టు విచారించింది. అల్లూరిని బ్రిటీష్ పోలీసు అధికారిగా చూపించార‌ని హై కోర్టు లో వాధించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిచేలా ఆర్ఆర్ఆర్ సినిమాలో స‌న్నివేశాలు ఉన్నాయని అన్నారు.

కాగ అయితే ఆర్ఆర్ఆర్ త‌ర‌పున లాయ‌ర్లు.. ఆర్ఆర్ఆర్ కేవ‌లం క‌ల్పిత క‌థ మాత్ర‌మే అని అన్నారు. అల్లూరి, కుమురం భీని దేశ భ‌క్తులుగానే చూపించామ‌ని హై కోర్టు తెలిపారు. కాగ విచార‌ణ సంద‌ర్భంగా హై కోర్టు ప‌లు ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసింది. విషం సోక్ర‌టీష్ ను చంపుతుంది కానీ.. ఆయ‌న సాహిత్యాన్ని కాద‌ని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సినిమా విడుద‌ల నిలిపివేయాల‌న్న పిటిషన్ ను సైతం హై కోర్టు కొట్టి వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news