ప్లీజ్ మలైకాను ఇబ్బంది పెట్టొద్దు.. ఆమె బాధలో ఉంది : విజయ్ వర్మ

-

బాలీవుడ్ యాక్ట్రెస్ మలైకా అరోరా తండ్రి సెప్టెంబర్ 11న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ముంబయిలో అనిల్ అరోరా (65) అంత్యక్రియలు జరిగాయి.ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. తీవ్ర దుఖంలో మునిగిపోయిన మలైకాను ఓదార్చారు.అయితే, తాజాగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

‘మలైకా బయట ఎక్కడ కనిపించినా ప్రశ్నలు అడుగుతూ ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఇది నా విజ్ఞప్తి. ప్లీజ్ దుఖంలో ఉన్న ఫ్యామిలీని ఒంటరిగా వదిలేయండి.ఆ బాధ నుంచి కోలుకోవడం వారికి అంత సులభం కాదు.అత్యంతమైన కఠినమైన సమయమిది. దయచేసి మీడియా మిత్రులు ఆమె కుటుంబంపై దయ చూపండి’అంటూ విజయ్ వర్మ ట్వీట్ చేశారు. కాగా, బిల్డింగ్ మీద నుంచి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆమె తండ్రి గురించి అంత్యక్రియల టైంలో మలైకాను మీడియా వారు ఫొటోలు తీయడంపై వరుణ్ ధావన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version