టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారం విషయంలో ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో నటి డింపుల్ హయతి, డేవిడ్ అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. రాహుల్ కారును అతడి డ్రైవర్ చేతన్ సెల్లార్లో పార్క్ చేస్తూ ఉంటాడు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హాయతి డేవిడ్‌లు కూడా తమ కారును పార్క్ చేస్తుంటారు.
ఈ నెల 14న డింపుల్ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న కారు ముందు భాగం దెబ్బతింది. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లకు 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు.