Mallareddy : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్యెల్యే మల్లారెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామిర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. మాజీ మంత్రి మల్లారెడ్డి పై ఎస్సి, ఎస్టీ కేసు, 420 కేసులు నమోదు చేశారు.
గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని శామీర్ పేట పోలీస్ స్టేషన్ ముందు గిరిజనుల ఆందోళనకు దిగారు.మంత్రి చమకూర మల్లారెడ్డి అని పిర్యాదులో పేర్కొన్నారు భాదితులు. FIR లో మాత్రం మల్లారెడ్డి అని పేర్కొనడంతో పోలీసులపై గిరిజనుల మండిపడుతున్నారు. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ పై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు.