యాంకర్ సుమ భర్త, టాలీవుడ్ స్టార్ నటుడు రాజీవ్ కనకాల కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421 లో ఉన్న వెంచర్లో రాజీవ్ కనకాలకు చెందిన ఓ వివాదాస్పద ప్లాట్ ఉంది. నిర్మాత విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ఆ ఫ్లాట్ విక్రయించారు.

ఇక సదర్ ఫ్లాట్ ను మరో వ్యక్తికి 70 లక్షలకు విక్రయించారు విజయ్ చౌదరి. లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి మోసం చేశారని తాజాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల నుంచి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయ్ చౌదరి పై కేసు కూడా నమోదు అయింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.