‘పింక్’ రీమేక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా బ‌న్నీ హీరోయిన్‌..

రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేపోయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. పవన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. పింక్‌ రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ ఇస్తున్న‌ది అంద‌రికి తెలిసిన నిజం. దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రం జ‌న‌వ‌రి 20న సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ఆయ‌న ఈ చిత్రానికి కాల్షీట్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. సినిమా అనుకున్న‌ప్ప‌టి నుంచి ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర చిన్నదే అయినా, కైరా అద్వాని పేరు వినిపించింది. అయితే ఆమె డేట్స్ కాస్త అటు ఇటుగా ఉండటం, పారితోషికం భారీగానే డిమాండ్ చేయడం జరిగిందట. అందువలన బ‌న్నీ అల వైకుంఠ‌పురములో హీరోయిన్‌ పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే వరుస హిట్లతో మంచి క్రేజ్ లో .. మంచి ఫామ్ లో వుంది. అందువలన ఆమె ఎంపిక దాదాపు ఖరారు అవుతుందని అంటున్నారు.