పూజా హెగ్డే వ‌ర్సెస్‌ రష్మిక.. ఎన్టీఆర్‌తో జ‌త‌క‌ట్టేది ఎవ‌రో..?

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి​ కల్యాణ్‌రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ ఇదే కాంబినేష‌న్ రిపీట్ కావ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కథపై కసరత్తు పూర్తి కాగానే, ఎన్టీఆర్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ పోతోంది.

ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే .. రష్మిక పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్ప‌టికే ఈమె అరవింద సమేతలోను, అల వైకుంఠపురములోను త్రివిక్ర‌మ్‌ను మెప్పించింది. మ‌రియు ఈ రెండు సినిమాలు విజయవంతం కావడం వలన, ఆ సెంటిమెంటుతో మళ్లీ ఆమెను తీసుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో వైపున రష్మిక కూడా వరుస హిట్లతో తన జోరు చూపిస్తోంది. అందువలన జోడీ కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రి త్రివిక్ర‌మ్ ఏ ముద్దుగుమ్మ‌కు ఛాన్స్ ఇస్తారో..? ఎన్టీఆర్‌తో జ‌త‌క‌ట్టేది ఎవ‌రో..? తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version