వాయిదా పడిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్..!

-

ప్రతి సంవత్సరం నటుల ప్రతిభను గుర్తించి వారికీ ప్రోత్సహం అందివ్వడానికి అవార్డ్స్ ని ఇస్తారు. అయితే ఈ సంవత్సరం అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ని గోవాలో న‌వంబ‌ర్ 20 నుంచి 28 వ‌ర‌కు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈ వేడుకులకు బ్రేక్ పడింది. 51వ చ‌ల‌న‌చిత్రోత్స‌వ సంబరాలు వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 16 నుంచి 24 మ‌ధ్య నిర్వహిస్తునట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన విషయాలను ఇటీవ‌ల గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. దీనిపై కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ దీనిపై తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్లడించారు.

fillm fare

ఇక ఈ ఏడాది అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించడానికి సిద్ధం అయ్యింది. ఐబీ మంత్రిత్వ‌శాఖ సూచ‌న‌ల మేర‌కు.. ఫిల్మ్ ఫెస్టివ‌ల్ స‌మ‌యంలో సినిమాల‌ను అఫిషియ‌ల్ డిజిట‌ల్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే గోవా ముఖ్యమంత్రి ఫెస్టివల్ మార్పు గురించి కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని అన్నారు. ఇక డైర‌క్ట‌రేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్, గోవా ఎంట‌ర్‌టైన్మెంట్ సోసైటీ సంయుక్తంగా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తున్నాయన్నారు. అయితే గ‌త ఏడాది ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో 76 దేశాల‌కు చెందిన 200 సినిమాల‌ను స్క్రీనింగ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version