టాలీవుడ్లోకి మరో వారసుడు.. హీరోగా ప్రభాస్ కజిన్ ఎంట్రీ

-

టాలీవుడ్‌లో వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలీలతో పాటు ఇతర హీరోలు కూడా వారి ఫ్యామిలీల నుంచి వారసులను రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు బ్లాక్బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్లు, ఇండియన్ సినిమాలోనే హైయ్యెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లు కురిపించిన సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మాత్రం తాను తప్ప ఇంకో వారసుడు ఎంట్రీ ఇవ్వలేదు.

అయితే తాజాగా ప్రభాస్ కుటుంబం నుంచి వారసుడొచ్చాడు. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ రెడీ అయ్యాడు. గౌడ్ సాబ్ పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాతో విరాట్ తెలుగు తెరపై పరిచయం కానున్నాడు. ఈ మూవీ తాజాగా లాంఛ‌నంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రంతో కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. గణేశ్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గబ్బర్ సింగ్ సాంగ్కు కొరియోగ్రఫీ చేసి ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version