ఆదిపురుష్ బాగాలేదన్న వ్యక్తి.. చితక్కొట్టిన అభిమానులు

-

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద ఆది పురుష్ మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహాలం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక వ్యక్తి ఆది పురుష్ సినిమా బాగాలేదని యూట్యూబ్ ఛానళ్లతో చెప్పాడు. దీంతో అభిమానులు అతన్ని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో ఓ ప్రేక్షకుడిపై దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున ఆది పురుష్ షో చూసేందుకు వచ్చిన ఆ వ్యక్తి హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహించిన కొందరు అతనిపై దాడి చేశారు. థియేటర్ సిబ్బంది వచ్చి గొడవ సర్దుమనిగేలా చూసి మరోచోట కూర్చోబెట్టారు. సీటులో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు ఫ్యాన్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version