ప్రభాస్‌- హను రాఘవపూడి సినిమా షురూ.. ఫొటో వైరల్‌

-

కల్కి సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుల షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. అయితే డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ప్రభాస్ నటిస్తున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభం అయింది. ఇవాళ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ పూజలో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇవాళ సాయంత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే పేరు ఖరారు చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version