మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ పథకంతో.. నెలకు రూ.7000 మీ సొంతం..!

-

భారతదేశ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా శాతం మందికి ఎన్నో విధాలుగా ఉపయోగకరమైనవి అనే చెప్పవచ్చు. దేశ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు ద్వారా ఎన్నో ఉపయోగాలను ప్రజలు పొందుతున్నారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను కేంద్రం అమలు చేస్తూ వచ్చింది. అయితే వాటిలో భాగంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే బీమా సఖి యోజన. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. అయితే దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయంతో పాటుగా శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నారు.

అర్హత వివరాలు:

బీమా సఖి యోజన పథకానికి పదో తరగతి పూర్తి చేసిన మహిళలు అర్హులు మరియు వయస్సు 18 నుండి 70 ఏళ్ల మధ్యలో ఉన్నవారు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే విధానం:

ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా లేక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బీమా సఖి యోజనకు సంబంధించి అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ తో పాటుగా పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం, వయసు ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా దరఖాస్తు చేసుకోవాలి.

అయితే ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా ప్రత్యేక శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. మొదటి మూడు సంవత్సరాలకు స్కాలర్షిప్ ను కూడా అందిస్తారు. అయితే ఆ స్కాలర్షిప్ ఒక్కో ఏడాదికి ఒక్కోరకంగా ఉంటుంది మరియు వార్షిక పనితీరు ప్రకారం మహిళలు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. అయితే మహిళలు అమ్మిన పాలసీలలో 65 శాతం వరకు కొనసాగాలి. ఈ విధంగా ఎల్ఐసి ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version