బడ్జెట్లో అన్యాయం చేసిన బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు : జూపల్లి

-

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కానుకగా ఇదాం అని కామారెడ్డి జిల్లా ఇంచార్జి.. మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది అని అన్నారు.

అలాగే క్షేత్ర స్థాయిలో కేడర్‌, లీడర్‌ కష్టపడి పని చేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. పార్టీ అభ్యర్థి గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయ దుందుభి ఖాయం అని పేర్కొన్నారు మంత్రి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రంగం అనేది పని చేయాలి అన్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా బీజేపీ అన్యాయం చేసింది. అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి బీజేపీ సాధించిందేమీ లేదు మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version