త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ రాధేశ్యామ్-2 ?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బ్యూటీఫుల్ హీరోయిన్ జంట గా న‌టిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కు రాధ‌కృష్ణ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14 న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం స‌న్నాహాకాలు చేస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి ఒక వార్త అటు ఫీల్మ్ న‌గ‌ర్ లో ఇటు సోషల్ మీడియా లో చక్క‌ర్లు కొడుతుంది.

అది ఎంటి అంటే త్వ‌ర‌లో రాధేశ్యామ్ సినిమా కు సిక్వేల్ చేస్తార‌ని స‌మాచారం. అయితే దీని గురించి చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌క పోయిన గాసిప్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వ‌స్తున్న సినిమా లో చివ‌ర‌న ట్విస్ట్ లు పెట్టి రాధేశ్యామ్ -2 తీయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కు సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ తో రాధేశ్యామ్ సినిమా పై భారీ గా అంచ‌నాలు పెరిగి పోయాయి.