The Raja Saab Review: సంక్రాంతికి ప్రభాస్ హిట్ కొట్టాడా?

-

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ సినిమాపై మొదటి నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మారుతి లాంటి డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడన్న డౌట్ ఫ్యాన్స్‌లో మొదట కనిపించింది. కానీ రాజాసాబ్ నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్ ఆ అనుమానాల్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అన్నీ కలిసొచ్చి సినిమాపై హైప్‌ని మామూలు స్థాయి నుంచి నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్‌లో మరో కొత్త ప్రయోగం అనే చెప్పాలి. ఇప్పటివరకు యాక్షన్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్లలో కనిపించిన ప్రభాస్… తొలిసారిగా హారర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ను ట్రై చేయడం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. నేడు (జనవరి 9) గ్రాండ్ రిలీజ్‌ రిలీజ్ అయ్యింది. మరి ప్రభాస్–మారుతి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది? సంక్రాంతికి ప్రభాస్‌కు ఇది హిట్‌గా నిలిచిందా లేదా? తెలుసుకోవాలంటే… కథలోకి వెళ్లాల్సిందే!

Prabhas The Raja Saab movie Review
Prabhas The Raja Saab movie Review

మూవీ కథ : ఒకప్పుడు దేవనగర సంస్థానాన్ని పాలించిన జమీందారు గంగాదేవి (జరీనా వహాబ్).
ఇప్పుడు ఆమె తన మనవడు రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంది. నానమ్మంటే రాజుకు ప్రాణం. అప్పటికే గంగమ్మ మతిమరుపుతో బాధపడుతుంటుంది. కానీ తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని మాత్రం ఆమె ఎప్పటికీ మర్చిపోదు. తన కలల్లో కనిపిస్తున్న భర్తను వెతికి తీసుకురమ్మని రాజును కోరుతుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. కనకరాజే తన అతీతమైన శక్తులతో రాజు–గంగమ్మలను నర్సాపూర్ అడవిలోని రాజమహల్ కు రప్పిస్తాడు. అక్కడ మొదలయ్యే భయంకరమైన సంఘటనలే ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. అసలు కనకరాజు గతం ఏమిటి? అతను తన భార్య, మనవడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఎన్నో విద్యలు నేర్చుకున్న కనకరాజుకు రాజా సాబ్ ఎలా ఎదురుతిరిగాడు? అంతేకాక 3 హీరోయిన్స్ కు రాజు కు వున్న సంబంధం ఏమిటి తెలియాలంటే? ‘ది రాజాసాబ్’ సినిమాను తెరపై చూడాల్సిందే!

Prabhas The Raja Saab movie Review
Prabhas The Raja Saab movie Review

విశ్లేషణ: ప్రభాస్ ఈసారి యాక్షన్ కాదు, ఫుల్ కామెడీ, హారర్ మిక్స్‌లో కనిపిస్తాడు. టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్… అన్నీ బాగున్నాయి. ఫ్యాన్స్‌కి కొత్త ప్రభాస్ చూడాలనుకున్నవాళ్లకు ఇది ట్రీట్. సంజయ్ దత్ ఐతే విలన్‌గా భయపెట్టే లుక్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్. అతని పాత్రే సినిమాకి డార్క్ టోన్ ఇస్తుంది.ఇక హీరోయిన్స్గా  (మాలవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్) – గ్లామర్‌తో పాటు కథలో అవసరమైన పాత్రలు. కామెడీ సీన్స్‌లో మంచి సపోర్ట్ చేసారు. మ్యూజిక్ & BGM చూస్తే హారర్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్క్ అయ్యింది. పాటలు పర్లేదు అని టాక్.ఇక విజువల్స్ & VFX  రాజమహల్ సెట్స్, గ్రాఫిక్స్ సినిమాటిక్‌గా ఉన్నాయి. కొన్ని చోట్ల CG మెరుగ్గా ఉంటే ఇంకా బాగుండేది. ఇక చివరిగా
డైరెక్షన్ (మారుతి) ఎంచుకున్న పాయింట్లో కామెడీ + హారర్‌ని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
* ప్రభాస్ కొత్త లుక్
* కామెడీ సీన్స్
* హారర్ ఎలిమెంట్స్
* సంజయ్ దత్ విలనిజం.

మైనస్ పాయింట్స్:
* కొంత నిడివి, మ్యూజిక్
* కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్

చివరిగా: ‘ది రాజాసాబ్’ ఒక పక్కా ఎంటర్‌టైనర్. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ కామెడీ ట్రాక్, కుటుంబ ప్రేక్షకుల కోసం హారర్–ఫాంటసీ మిక్స్. అన్ని వర్గాల వారిని మెప్పించదగిన మాస్టర్‌పీస్ కాకపోయినా, సంక్రాంతికి థియేటర్‌లో ఎంజాయ్ చేయదగిన సినిమా అని చెప్పచ్చు.

రేటింగ్: 3 / 5

గమనిక: పైన ఇచ్చిన సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Read more RELATED
Recommended to you

Latest news