బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ఆయన సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ప్రదీప్ సినిమాలతో పాటు ఆయన పెళ్లి గురించి కూడా ఇటీవల న్యూస్ వైరల్ అవుతోంది. ఓ రాజకీయ నేతతో ఆయన పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా ప్రదీప్ తన పెళ్లి రూమర్స్ పై స్పందించాడు. టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మ్యారేజ్ ప్లాన్స్ లేవని.. లైఫ్ లో సెటిల్ అయ్యాక ఆలోచిస్తానని తెలిపాడు. తనకంటూ కొన్ని డ్రీమ్స్, లక్ష్యాలు ఉన్నాయని.. అవి సాధించిన తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచిస్తానని చెప్పాడు. అయితే తన లక్ష్యాలు సాధించడం కాస్త ఆలస్యం అవుతుండటంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైెం పడుతాయని.. అవన్నీ సరైన సమయానికే పూర్తి అవుతాయని నమ్ముతున్నాంటూ ప్రదీప్ తన పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.