ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే

-

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 9 కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ), ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్‌ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలివే..

  1. అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్‌ పోర్టు ఏర్పాటు
  2. త్రీ స్టార్‌, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్‌ ఫీజు రూ.25లక్షలకు కుదిస్తూ ఆమోదం
  3. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్
  4. రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ పచ్చజెండా
  5. ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనలు-2025లకు గ్రీన్ సిగ్నల్
  6. నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం
  7. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు పచ్చజెండా

Read more RELATED
Recommended to you

Latest news