ప్రగతి ఆంటీ ఒక్క రోజు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈమె. ప్రస్తుతం సినిమాలలో కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా ఈమె క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇండస్ట్రీ లో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టు ఉన్నప్పటికీ ఈమె క్రేజ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. నటీనటులకు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఇక ఈ నటీనటుల పారితోషకం ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే ప్రతి రోజు వీరికి రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారట.ఎన్నిరోజులు నటిస్తారో అన్ని రోజుల వరకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు దర్శక నిర్మాతలు. ప్రగతి ఒక్కరోజు రెమ్యూనరేషన్ రూ.75 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్ అన్ని సినిమాలకు ఒకేలా ఉండకపోవచ్చు . పెద్ద సినిమాలకు ఒకరకంగా చిన్న చిత్రాలకు ఓరకంగా తీసుకుంటూనే ఉన్నది.

తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న ప్రగతి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది . ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేసే హవా చాలా ఎక్కువగానే వుంటుంది. ఇక అప్పుడప్పుడు తన జిమ్ ఫోటోలు, వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక దీంతో నెటిజన్స్ పలురకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరియర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలను స్వయంగా తెలియజేసింది. తాజాగా f-3 సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకుంది ప్రగతి. రాబోయే రోజులలో మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version