Pragya Jaiswal : సాగరతీరాన రెడ్ ఫ్రాక్‌లో ప్రగ్యా జైస్వాల్ సోయగాలు

-

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది ఈ భామ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చేస్తాయి, టాలీవుడ్ లో బిజీ బిజీ అయిపోతుందని అంతా భావించారు. కానీ ఈ భామకు కాలం కలిసిరాలేదు

కంచె తర్వాత టాలీవుడ్ లో ప్రగ్యా..  ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా నర్సింహా రెడ్డి వంటి సినిమాల్లో మెరిసింది. ఇందులో ఓ సినిమా తనకు మరో అవకాశాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. అలా ప్రగ్యా టాలీవుడ్ లో నెమ్మదిగా ఫేడవుట్ అయిపోయింది.

అయితే సినిమా ఛాన్సులు లేకున్నా ఈ భామ ఫాలోయింగ్ కు మాత్రం ఢోకా లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది ప్రగ్యా. తాజాగా వెకేషన్ లో ఉన్న ప్రగ్యా బీచ్ ఒడ్డున అందాల ఆరబోత చేసింది. రెడ్ కలర్ ఫ్రాక్ లో సముద్రపు అలల ఒడిలో తన సోయగాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news