యంగ్ టైగ‌ర్ కోసం వ‌స్తున్న విజ‌య్ సేతుప‌తి.. ప్ర‌శాంత్ నీల్ ప్లాన్‌!

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే నేష‌న‌ల్ స్టార్‌గా అవ‌త‌రించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎలాగూ నేష‌న‌ల్ వైడ్ క్రేజ్ వ‌చ్చేస్తుంది. అందుకే దీని త‌ర్వాత చేసే సినిమాలన్నీ ప్యాన్ ఇండియాగా ఉండేలా చూసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం దీని త‌ర్వాత కొర‌టాల శివ‌తో త‌న 30వ సినిమా చేస్తున్నాడు. అలాగే కేజీఎఫ్‌తో సంచ‌ల‌నంగా మారిన ప్ర‌శాంత్ నీల్ తో మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు.

 

ఇక ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్నాడు యంగ్ టైగ‌ర్‌. అయితే ప్ర‌శాంత్ నీల్‌తో చేసే సినిమా నుంచి ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. ఇందులో న‌టించేందుకు ఓ త‌మిళ స్టార్‌ను తీసుకొస్తున్నారంట‌. ఇప్ప‌టికే ఆయ‌న కూడా ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది.

తమిళ్ స్టార్, విల‌క్ష‌ణ న‌టుడు, మక్కల్ సెల్వన్ అయిన విజయ్ సేతుపతిని ప్రశాంత్ నీల్ తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌థ చెప్ప‌గానే విజయ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పిన‌ట్టు స‌మాచారం. విజ‌య్ సేతుప‌తికి ఇప్పుడు సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న ఉప్పెన‌తో తెలుగు ప్రేక్ష‌కులకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం ప్ర‌శాంత్ నీల్ అన్ని భాష‌ల వారిని తీసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version