తిరుపతిలో డ్రాగన్ (పడవ) పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. రామచంద్రాపురం (మం) రాయలచెరువులో డ్రాగన్ (పడవ) పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. శాప్, ఏపీ కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. జనవరి 9వ తేదీ వరకు కొనసాగనున్న డ్రాగన్ పోటీలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో సీనియర్.. 11నుంచి 16వరకు కేరళలో జరిగే జూనియర్ 13వ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు జట్లు ఎంపిక ఉంటుంది. విజయవాడ, వైజాగ్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 50 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. రెండు బోట్లలో 12మంది చొప్పున వెయ్యి మీటర్ల పొడవును వేగంగా చేధించిన వారిని గుర్తించి ఎంపిక చేస్తారు. అయితే.. ఈ నేపథ్యంలోనే…రామచంద్రాపురం (మం) రాయలచెరువులో డ్రాగన్ (పడవ) పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తి నాని.