ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న వారిలో ఎక్కువగా చదువుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, టెకీలు, జడ్జీలు సైతం ఉన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడో చోట ఇటువంటి మోసాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ముంబై పోలీస్ అంటూ స్కామ్ వీడియో కాల్ చేసిన ఎదుటి వ్యక్తి షాక్ తగిలింది. వీడియో కాల్ చేయగానే అవతలి వ్యక్తి గుర్తించి వెంటనే తన ఫేస్ చూపించకుండా కుక్కపిల్ల మొహాన్ని వీడియో కెమెరా ముందుంచాడు. వచ్చాను సర్.. నకిలీ యూనిఫాం అని అనగా స్కామ్ ఫలించలేదని ఫోన్ కట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. సైబర్ నేరస్తుడికి షాకిచ్చిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్కామ్ చేద్దాం అని కాల్ చేసిన వ్యక్తికి షాక్..
ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి ముంబై పోలీస్ అధికారిని అంటూ మాట్లాడగా ఎదుటి వ్యక్తి మోసాన్ని గ్రహించి కుక్క పిల్లను మొబైల్ స్క్రీన్ ముందు పెట్టాడు. వచ్చాను సర్.. నకిలీ యూనిఫాం అని అనగా స్కామ్ ఫలించలేదని ఫోన్ కట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా… pic.twitter.com/psEqIAP0mo
— ChotaNews App (@ChotaNewsApp) December 28, 2024