బరువు తగ్గాలన్న ఉద్దేశంతోనో, లేక మరే ఇతర ఉద్దేశంతోనో ఆహారం తినకుండా ఉండటం మంచిది కాదు. చాలామంది బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. కొందరు మధ్యాహ్నం అన్నం తినడం మానేస్తారు. ఇంకొంతమంది రాత్రి ఖాళీ కడుపుతూనే పడుకుంటారు.
భోజనం విషయంలో ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు డాక్టర్‍ని సంప్రదించడం మంచిది.
ముఖ్యంగా భోజనం చేయకపోవడం వల్ల కొందరికి తలనొప్పి వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే..
భోజనం చేయకపోవడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మెదడు సరిగ్గా పని చేయదు. కాన్సన్ ట్రేషన్ తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మాటిమాటికి మూడు మారిపోవడం జరుగుతుంది.
చాలాసేపటి వరకు మీరు భోజనం చేయకపోతే గ్లూకోస్ స్థాయిలు ఇంకా తగ్గుతాయి. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్లయిన కార్టిసాల్ విడుదలవుతుంది. దానివల్ల చిరాకు, యాంగ్జయిటీ పెరుగుతుంది.
అందుకే అనవసరంగా ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం ఉండరాదు.
ఖాళీ కడుపుతో ఎంతసేపు ఉండవచ్చు?
పోషకాహార నిపుణుల ప్రకారం ఒక రోజులో నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే ఖాళీ కడుపుతో ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే పైన చెప్పిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే.. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.