ఇంట్రడక్షన్:-మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోలలో కాస్త డిఫరెంట్ స్టయిల్ సినిమాలు చేస్తాడు అనే పేరు ఉంది సాయి ధరం తేజ్ కి .. మారుతి లాంటి కమర్షియల్ డైరెక్టర్ ని ఎంచుకున్న సాయి నేరుగా కామెడీ నే అస్త్రంగా చేసుకుని రంగం లోకి దిగేశాడు. బాబు బంగారం తరవాత కమర్షియల్ హిట్ కోసం చూస్తున్న మారుతి కి గీతా ఆర్ట్స్ గొప్ప అవకాశం ఇచ్చింది అనే చెప్పాలి . ట్రెయిలర్ తో కూడా ఆకట్టుకున్న ప్రతి రోజు పండగే బృందం ఈ సినిమా ని తెరమీద ఎంతవరకూ పండగ చేసిందో చూద్దాం రండి
కథ – విశ్లేషణ : పల్లెటూర్లో ఉండే తండ్రులు – విదేశాల్లో ఉండే కొడుకులు .. స్థూలంగా చెప్పాలి అంటే ఇదే కథ. దీనికి కామెడీ , కమర్షియల్ ఎలిమెంట్ లూ , లవ్ స్టోరీ ఇలా చాలా యాడ్ చేశాడు మారుతి. దాంతో సినిమా ఆసాంతం సరదాగా సాగుతుంది. తనకి క్యాన్సర్ అని చెప్పి కొడుకుల్ని , కూతుర్లని మొత్తం పరివారాన్ని అంతా ఉన్నపళంగా ఇండియా రప్పిస్తాడు సత్యరాజ్ .. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ వాళ్ళు ఎంత సేపూ డాలర్లు , డబ్బులు , ఫోన్ ల గోలలో బతుకుతూ ఉంటారు .. పెద్దాయన ( సత్యరాజ్) కూడా ఆరోగ్యం బాలేనివాడు లాగా కాకుండా హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు తన మనవడు సాయి ధరం తేజ్ తో.. రావు రమేశ్ తో సీన్ లూ , లీడ్ ఫైర్ మధ్య కెమిస్త్రీ చాలా బాగా హ్యాండిల్ చేసిన మారుతి ఎమోషన్ విషయం లో తడబడ్డాడు ..
పాజిటివ్: ఈ సినిమా కి అతిపెద్ద పాజిటివ్ కారెక్టర్ రావు రమేశ్ దే అని చెప్పాలి .. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా .. సత్యరాజ్ కీ రావు రమేశ్ కీ మధ్య సీన్ లలో ఇతర పాత్రలని తీసుకొచ్చి కావాల్సినంత హాస్యం పాడించాడు మారుతి. హరితేజ దగ్గర నుంచి ప్రతి చిన్న కారెక్టర్ నీ చక్కగా ఉపయోగించుకున్నాడు. రావు రమేశ్ డైలాగ్స్ ఈ సినిమా కి బాగా వర్క్ అయ్యాయి. పాటలు తెరమీద చాలాబాగా తీస్తాడు అనే పేరున్న మారుతి మరొకసారి నిరూపించుకున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా కుదిరింది.
నెగెటివ్: సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్ లు సరిగ్గా పండగ పోవడం అతిపెద్ద నెగటివ్. విదేశాల్లో ఉండే కొడుకులు , కూతుర్లు మరీ విలన్లు అన్నట్టుగా చూపించడం బాలేదు. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్ ల కంటే క్లాస్ పీకదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ని అద్భుతంగా డీల్ చేసిన మారుతి సెకండ్ హాఫ్ లో తేలిపోయాడు. మెసేజ్ చెప్పాలి అనుకున్న ఈ చిత్ర బృందం దానికంటే ఎక్కువగా కామెడీ మీద ఫోకస్ చెయ్యడం ప్రేక్షకులకి రుచించకపోవచ్చు .. రాశి ఖన్నా కారెక్టర్ ఇంకా బాగా డీల్ చేయాల్సి ఉంది.
మొత్తంగా : మొత్తంగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ నే ప్రధాన అంశంగా ఎంచుకున్న మారుతి ఫస్ట్ హాఫ్ వరకూ అందులో సక్సెస్ అయ్యాడు .. కానీ సెకండ్ హాఫ్ విషయం లో తడబడ్డాడు అనే చెప్పాలి .. సెంటిమెంట్ + ఎమోషన్ ని సరిగా వండి వార్చలేకపోయాడు. అనవసరమైన సీన్ లు చాలా ఉన్నాయి. చాలా చోట్ల ‘శతమానం భవతి’ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఓవర్ ఆల్ గా ఒక్కసారి చూడదగ్గ చిత్రం. ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమా ని ఎలా తీసుకుంటారు అనేదానిబట్టి బాక్స్ ఆఫీస్ కలక్షన్ ఆధారపడి ఉంటుంది !