తన పెళ్లిపై స్పందించిన పృథ్వీ..!

-

23సంవత్సరాల అమ్మాయిని సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ పెళ్లి చేసుకున్నారు అని వచ్చిన వార్తలపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. తమిళ్ మీడియాతో వరుసగా మాట్లాడుతున్న పృథ్వీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడంపై మరో బిడ్డను కనే ఆలోచనపై వివరణ ఇచ్చారు.. కొన్ని రోజుల నుంచి 23 ఏళ్ల అమ్మాయిని రహస్యంగా వివాహం చేసుకున్నారని వారం రోజుల క్రితం తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ అమ్మాయి మలేషియా చెందిందని, ఆమెతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడని కూడా వార్తలు వినిపించాయి.. అయితే ఈ విషయం పై పృథ్వీరాజ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది..

అమ్మాయి వయసు 23 సంవత్సరాలు కాదు అని..24 సంవత్సరాలు అని , ఆ అమ్మాయి మలేషియా కు చెందింది కాదు అని తెలుగు అమ్మాయిని స్పష్టం చేశారు. ప్రేమ ఏ వయసులో పడుతుందో చెప్పలేమని.. ప్రేమకు పెళ్లికి వయస్త సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నా వయసు 56 సంవత్సరాలు . ఆ అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. నిజానికి నేను మొదట పెళ్ళికి ఒప్పుకోకపోయినా.. ఆమె మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకుని త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కంటానని తెలిపాడు. కర్ణాటకకు చెందిన పృథ్వీరాజ్ ఆరు సంవత్సరాల వయసులోనే బాల నటుడిగా బబ్లూ పేరుతో తమిళ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. అమ్మ మనసు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక 1997లో వడ్డే నవీన్ , మహేశ్వరి నటీనటులుగా వచ్చిన పెళ్లి సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఉత్తమ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని నంది అవార్డును సొంతం చేసుకున్న ఆ తర్వాత నుంచి తెలుగు ప్రేక్షకులకు పెళ్లి పృథ్వి అయిపోయాడు.

పెళ్లి సినిమా తర్వాత పెళ్లి పందిరి, పెళ్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు పృధ్వీ దగ్గరయ్యాడు. సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు ఆప్తుడిగా నటించి నడిపించారు అలా తెలుగులో 40 సినిమాలలో నటించారు. ప్రస్తుతం తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్నారు. ఇకపోతే 28 ఏళ్ల క్రితం అనగా 1994లో బీనా ను వివాహం చేసుకున్న పృద్వికి అహెద్ మోహన్ జబ్బర్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 27 సంవత్సరాలు కానీ ఆటిజం తో బాధపడుతున్నాడు. గత ఆరేళ్లుగా భార్యతో గొడవలు పడుతుండడం వల్లే విడిపోయి.. ఒంటరిగా జీవిస్తున్నానని.. నెలకోసారి నా కొడుకును కలుస్తాను అని ఇంటర్వ్యూలో తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version