కర్మ యొక్క సాధన

-

సాధారణంగా ఆధ్యాత్మిక జీవతంలో ఉండి సాధన చేస్తున్నవారు కొన్ని చోట్ల తికమక పడుతుంటారు. పెడుతుంటారు కూడా గురువుగారు చెప్పినట్లు రెండు విషయాల్లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు నటిస్తారు చాలామంది. లక్ష్మి విషయంలో ఎంత ఉన్నా లేదనీ, సరస్వతి విషయంలో ఎంత డొల్లైనా అంతా తెలుసనీ  అంతా కాకపోయినా ఎంతో తెలుసనీ.
ఇక అక్కడ్నుంచి ఇదెవరు చెప్పారు అదెవరు చెప్పారు ఇవన్నీ ట్రాష్ ఆధ్యాత్మ సాధనలో ఇవేంటి అవేంటి, నియమాలు నిబంధనలు అధికారం, అర్హత నథింగ్ డూయింగ్ వాళ్ళకన్నా మేమే బెటర్ వంటి బోలెడు సూక్తులు సుభాషితాలు వల్లించి దేశోద్ధరణం చేస్తున్నామనుక్కునే “సౌజన్యారావు”లు (కన్యాశుల్కం నుండి ఈ పేరు స్వీకరించా)  కొందరు.
సరే, మనది వైదిక ధర్మం, వేదమే ప్రమాణంగా ఉన్న జీవన విధానం. ఈ వేదం రెండు విషయాలను ఇమడ్చుకుని ఉంటుంది. అవే కర్మకాండ జ్ఞాన కాండ. ప్రజాపత్యాదిగా జ్ఞానం వేపుకి వెళ్లడానికి వైదిక కర్మావలంబనం చేసి ఆ కర్మలు పండి జ్ఞాన ఫలాన్ని పొందడం సదాచారం సనాతన వైదిక సంప్రదాయమూనూ.
ఐతే కొన్ని సార్లు జ్ఞానానికి ఎవరు అధికారులు అన్నప్పుడు బాల, స్త్రీ, వృద్ధాది వయోబేధాలు కానీ, లింగ బేధాలు కానీ,   వర్ణాశ్రమాది బేధాలు కానీ లేకుండా సర్వులూ జ్ఞానముపొందడానికి, జ్ఞాన సముపార్జనకి అధికారులే అర్హులే అని శాస్త్రాలు ప్రజాపత్యాదిగా సమస్త గురుమండలం చెప్పినదీ అదే.  “జ్ఞానమును సాధించడానికి పై బేధములేవీ అడ్డురావు, జ్ఞానమునుపొందడానికి అందరికీ అధికారమున్నది” .
దానికి అధికార బేధాలు లేవు. కర్మల విషయంలో ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి. ఈ రెంటికీ తేడాతెలీకపోవడంతోటే, భగవంతుడి దగ్గర ఇన్ని నియమాలేంటండీ, మాదేవుడికి మాకు తోచిన రీతిలో చేస్కుంటే తప్పంటారు మీ సాంప్రదాయవాదులు అనేటటు వంటి తెలిసీ తెలీని అపాండిత్యపు మాటలు బయటపడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version