ఇప్పటికే 200 సార్లు కన్నుకొట్టా..!

-

కొంటెగా కన్నుకొట్టి కుర్రాళ్ల మనసు గిల్లడం నారీమణులకు అలవాటే కాని మళయాళ భామ కన్ను కొడితే మాత్రం ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసింది. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. ఒరు ఆధార్ లవ్ సినిమాలో ఓ టీజర్ లో కన్నుకొట్టి తుపాకి పేల్చిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఆమె పేల్చిన తుపాకి గుండుకి కోట్ల హృదయాలు పేలిపోయాయి. 30 సెకన్ల టీజర్ లో ఆమె చూపించిన ఎక్స్ ప్రెషన్ కు అందరు ఫిదా అయ్యారు.

అయితే ఆ క్రేజ్ తోనే ఒరు ఆధార్ లవ్ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈమధ్యనే జరిగింది. అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియా ఇప్పటికే తాను 200 సార్లు కన్ను కొట్టానని.. తను కన్ను కొట్టడం ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదని.. తనకు ఇప్పటికి ఈ విషయం అర్ధం కావట్లేదని అన్నది ప్రియా ప్రకాశ్. మొత్తానికి ఒక చిన్న సైగతో ఇంటర్నెట్ లో హంగామా సృష్టించి ప్రియా రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version