గణతంత్ర వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్న పిల్లలపై కరెన్సీ నోట్లు విసిరిన పోలీసు..

-

సాధారణంగా ఎవరైనా రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ల మీదనో… లేదంటే పెళ్లి బరాత్ లో ఎగిరే వాళ్ల మీదనే డబ్బులు జల్లుతుంటారు. కానీ.. ఈ పోలీసాయన చూడండి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్నవిద్యార్థులపై కరెన్సీ నోట్లు విసిరి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలోని నాంద్ లో చోటు చేసుకున్నది.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా… నాంధ్ లోని జిల్లా పరిషత్ స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది విద్యార్థులు డ్యాన్సులు వేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ప్రమోద్ వాల్కే అనే ఓ పోలీస్ స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేస్తున్న పిల్లల మీదికి కరెన్సీ నోట్లను విసిరాడు.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అక్కడి వాళ్లు… ఆయన్ను వారించారు. ఆ పోలీసు పిల్లలపై కరెన్సీ నోట్లు జల్లుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పోలీసు అఫీషియల్స్ కు చేరడంతో ప్రమోద్ పై క్రమశిక్షణారాహిత్యం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version