నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ ప్రాజెక్టులో అల్లు అరవింద్ కూడా భాగమవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అన్ని విషయాలు బన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడట.
ఊహించని విధంగా నా పేరు సూర్య ఫ్లాప్ అవడంతో బన్ని కెరియర్ రిస్క్ లో పడ్డది. అందుకే త్రివిక్రం సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా బన్ని వేలు పెడుతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బన్ని త్రివిక్రంను ఫాలో అయ్యాడు. ఆ రెండు హిట్ కొట్టాయి కాబట్టి గురూజికే అన్ని బాధ్యతలు అప్పగించాడట బన్ని. ఆయన ఏం చెబితే అదే అన్నట్టుగా ఉన్నాడట. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో కూడా కియరా పేరు వినిపిస్తుంది. మరి అమ్మడు ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.