నటి రేవతి ఆరోపణలతో కీలక పదవికి నిర్మాత రాజీనామా

-

మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ ఇటీవల వెలుగులోకి వచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, వాళ్లు కోరిన కోరికలను తీరిస్తేనే అవకాశాలు వచ్చే పరిస్థితి నెలకొందని ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ రిపోర్టు ఇప్పుడు మాలీవుడ్ను కుదిపేస్తోంది. ఆ రిపోర్టులో పలు దర్శకులు, నిర్మాతలు, ఇతర సినిమా పెద్దల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మలయాళ దర్శక – నిర్మాతలను ఉద్దేశించి పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ పరిశ్రమకు చెందిన నటి రేవతి సంపత్‌ ప్రముఖ నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపారు. నటి ఆరోపణలతో సిద్దిఖీపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తన పదవికి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version