Baby : ‘బేబీ’ డైరెక్టర్‌కు నిర్మాత బెంజ్ కారు గిఫ్టు… ఎంతంటే?

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా మేనియానే. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై మీమ్స్ మామూలుగా లేవు. అటు మౌత్ టాక్.. ఇటు కలెక్షన్లతో బేబీకి మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తోంది. డైరెక్టర్ సాయి రాజేష్ ఒక చిన్న కథను తీసుకుని చాలా సులభమైన విధానంలో “బేబీ” అనే సినిమాను ప్రేక్షకులకు అందించాడు.

Producer SKN gifted a Benz car to Cult Blockbuster Baby director Sai Rajesh
Producer SKN gifted a Benz car to Cult Blockbuster Baby director Sai Rajesh

అయితే… ‘బేబీ’ సినిమా సంచలన విజయం సాధించడంతో నిర్మాత SKN… దర్శకుడు సాయి రాజేష్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బ్రాండ్ న్యూ బెంజ్ కారును అందించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన డైరెక్టర్….మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తానని చెప్పారు. కాగా, సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో విడుదలకు ముందే సాయి రాజేష్ కు MG హెక్టార్ కారును ఇచ్చారు. MG హెక్టార్ కారు ధర రూ. 50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ మూవీకి దాదాపు రూ.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news