టీసీఎస్‌ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్‌’కు గుడ్‌బై

-

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి ఈ కంపెనీ గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశమిచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కరోనా ముందు లాగే.. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని కంపెనీ మెయిల్​లో పేర్కొంది.

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇచ్చాయి. అయితే కరోనా తగ్గిన తర్వాత కూడా పలు ఐటీ కంపెనీలు అదే విధానాన్ని అనుసరించాయి. కొన్ని రోజుల తర్వాత వర్క్‌ఫ్రమ్‌ తీసేసి.. హైబ్రిడ్‌ వర్క్‌ విధానాన్ని మొదలుపెట్టారు. ఈ విధానంలో ఉద్యోగులు వారంలో మూడ్రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా చాలా సంస్థల్లో ఇదే విధానం అమలవుతోంది. తాజాగా హైబ్రిడ్ విధానానికి టీసీఎస్ ఫుల్​స్టాప్ పెట్టేసింది. ఇక టీసీఎస్ బాటలోనే మిగతా కంపెనీలు కూడా నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news