తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రదర్శన విషయంలో కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే..? హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP టీమ్ హనుమాన్ సినిమా జనవరి 12, 2024 నుంచి హనుమాన్ సినిమా ప్రదర్శించాలని తెలంగాణలో కొన్ని థియేటర్లు వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ థియేటర్ల యజమానులు ఆ అగ్రిమెంట్లును పట్టించుకోకుండా నైజాం ఏరియా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించకుండా వేరే సినిమాలు ప్రదర్శించారు.
విషయమై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు ఫిలిం ఛాంబర్ సహా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా ఫిర్యాదు చేశారు. థియేటర్లు అగ్రిమెంట్ ప్రకారం.. హనుమాన్ సినిమా ప్రదర్శన చేయకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది. ఈ థియేటర్లు వెంటనే హనుమాన్ సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టం భరించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. థియేటర్ల వాళ్లు చేసే ఇటువంటి చర్యల వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని.. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ..ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం.