పుష్ప -2 సినిమా ముందుగానే రిలీజ్ కాబోతోందా..?

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా నటించిన చిత్రం పుష్ప.. ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించగా.. అనసూయ ,సునీల్, ఫహద్ ఫాజిల్ తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. దీంతో పుష్ప-2 సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర బృందం.

అందుకు సంబంధించి షూటింగ్ కూడా సెరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోని విడుదల చేయగా ఇందులో అల్లు అర్జున్ లు సరికొత్త గా కనిపిస్తోంది. ఈ సినిమా పైన దీంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమా విడుదల తేదీని జనవరిలో ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందుగానే ఈ ఏడాది డిసెంబర్ లోని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు ఇదొక పండగే అని చెప్పవచ్చు. అని అనుకున్నట్టుగానే జరిగితే ఈ ఏడాది డిసెంబర్ 22న పుష్ప-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప మొదటి భాగాన్ని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.దీంతో పుష్ప -2 సినిమా కూడా డిసెంబర్ లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట .మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం స్పందిస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news