సుకుమార్ దర్శకత్వం లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్. పుష్ప రెండవ భాగం సినిమా రిలీజ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.ఈ సినిమా రిలీజ్ తేదీ మారబోతున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
వాసవంగా డిసెంబర్ 6వ తేదీ 2024లో రిలీజ్ చేయాలని ఈ చిత్ర బృందం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఒక రోజు ముందుగానే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. కాగా, తాజాగా 6th DEC రిలీజ్ అంటూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి.. క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం.