తెగ్గేదిలే అంటూనే, ఇంకా వెనక్కి వెళ్తున్న అల్లు అర్జున్.!

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళి పోయారు. అల్లు అర్జున్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం పిధా అయ్యింది. ఇప్పుడు అందరూ రెండొ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తున్నాయి.

2022 జనవరి నుండిఈ సినిమా షూటింగ్  ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దానికి కారణం స్క్రిప్ట్ లో మార్పుల కోసం ఆగడమే. పుష్ప మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నినమోదు చేసింది, దీనితో రెండో పార్ట్ అయిన పుష్ప 2 కోసం భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనితో మరింత యాక్షన్ , మరిన్ని ట్విస్టు లతో స్క్రిప్ట్ ను సుకుమార్ తన టీమ్ తో కలసి  సూపర్ గా మార్చి వేసాడట.

గతంలో అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, లొకేషన్స్ కూడా ఒకే అయ్యాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యే ఛాన్స్ లేదట. వచ్చే నెల నవంబర్ నుండి సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అంటున్నారు. సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version