‘మళ్లీ పెళ్లి’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌..నరేశ్‌ – పవిత్రాల ముద్దుల వర్షం !

-

నరేష్‌ హీరోగా మళ్లీ పెళ్లి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ సీనియర్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా అందులో రమ్య రఘుపతి తో గొడవలు, ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు, అలాగే రమ్య నరేష్ పై చేయించిన దాడులు అన్నింటినీ కూడా తమ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించిన సన్నివేశాలను మనం ఇందులో చూడవచ్చు.

ఈ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ నరేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ వార్తలు బలంగా వినిపించాయి. ఇక తెలుగుతోపాటు కన్నడలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనెల 26వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఎంఎస్ రాజు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇక ఇవాళ ఈ సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది. ఈ సాంగ్‌ లో రొమాంటిక్‌ సీన్స్‌ బాగున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version