కామెడీ పండించే నరేష్ ఇప్పుడు సీరియస్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా తాను హీరోగా ప్రయత్నించిన మొదటి సినిమా “నాంది”. ఈ సినిమాను డైరెక్టర్ విజయ్ కనకమేడల అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కొంతకాలం తర్వాత వీరి జోడీ మళ్ళీ మరో సినిమాతో ఈ రోజు థియేటర్ లలో రిలీజ్ అయింది. పోస్టర్ మరియు ట్రైలర్ లతో ఆకట్టుకున్న వీరి కాంబో మరో హిట్ ను ఆదుకుందా అంటే అవుననే సమాధానం థియేటర్స్ నుండి వినిపిస్తోంది. డైరెక్టర్ విజయ్ కథలోకి తీసుకెళ్లిన విధానంగా ఆకట్టుకుంది. అయితే మధ్యలో రొటీన్ ఎమోషనల్ డ్రామా మరియు లెంగ్తీ ఫైట్ సీక్వెన్స్ లు కథపై ఆసక్తిని తగ్గించినా , చివరికి ట్విస్ట్ లతో సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా ముగించాడు.
“నాంది” కాంబో “ఉగ్రం”తో మరో హిట్ కొట్టారా ?
-