మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్..!

-

మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోసారి గొడవలు పునరావృత్తం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారట రాచకొండ సీపీ. దాదాపు గంటన్నర సేపు విష్ణును విచారించారు సీపీ సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారట.

Rachakonda CP Warning to Manchu Vishnu

జల్ పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించాలని విష్ణును ఆదేశించిన సీపీ సుధీర్ బాబు…. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్ల పై విష్ణు సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.  కాగా నిన్న రాత్రి రాచకొండ సీపీ ఆఫీసుకు మంచు విష్ణు వచ్చి.. విచారణను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా మంచు ఫ్యామిలీలో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విష్ణును విచారించారు సీపీ సుధీర్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version