ఏపీ ప్రజలకు ఊరట… తప్పిన పెను ప్రమాదం!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను ప్రమాదమే తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు తాజాగా తప్పింది. ఫెంగల్ అనే భయంకరమైన తుఫాను భారీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పించుకుంది. ఈ తుఫాన్ తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన ఆల్పపీడిన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని… తాజాగా అమరావతి వాతావరణ శాఖ ప్రకటన చేయడం జరిగింది.

The state of Andhra Pradesh was spared from the heavy storm called Fengal

అల్పపీడనం వాయుగుండం గా బలపడి శ్రీలంక అలాగే తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని తేల్చి చెప్పింది వాతావరణ శాఖ. దీని ప్రభావం నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో మోస్తా రు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది అమరావతి వాతావరణ శాఖ. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version