పోలీసులకే ఝలక్‌ ఇచ్చిన రాజ్ తరుణ్ లవర్ లావణ్య ?

-

రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్ లవర్‌ లావణ్య కు నోటీసులు ఇచ్చారు నార్సింగ్ పోలీసులు. లావణ్య విమెన్ ఆఫీసర్ కు 4 పేజీల ఫిర్యాదు కాపీ ఇచ్చి వెళ్ళిందని… ఆమె ఇచ్చిన ఫిర్యాదు కూడా ఫార్మాట్ లో లేదని పోలీసులు చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ తో పాటు.. మరికొందరి పై సంచలన ఆరోపణలు చేసిందన్నారు.

raj tarun lavanya case tollywood

తేదీలు, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ ఫిర్యాదు లో పేర్కొనలేదని నార్సింగ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లావణ్య కు నోటీసు ఇచ్చామని… తను చేసిన ఫిర్యాదు పై ఆధారాలు ఇవ్వమని నోటీస్ ఇచ్చామని తెలిపారు. అయినా కూడా తమ నోటీసులకు లావణ్య స్పందించలేదు.. కాల్స్ చేసినా ఆన్సర్ చేయడం లేదని పోలీసులు ఫైర్‌ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు చూస్తాం.. అప్పుడు కూడా స్పందించకపోతే…. తప్పుడు ఫిర్యాదు గా పరిగణిస్తామని వెల్లడించారు నార్సింగ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version