సిరిసిల్లలో నేతన్న వినూత్న నిరసన..విగ్రహం ఎక్కి మరీ !

-

సిరిసిల్లలో ఓ నేతన్న వినూత్న నిరసనకు దిగారు. పనుల్లేక పస్తులుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. సిరిసిల్లలో నేతన్న విగ్రహం ఎక్కి నేత కార్మికుడు నిరసన తెలిపారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో నేతన్న విగ్రహం ఎక్కి ఓ నేత కార్మికుడు నిరసన వ్యక్తం చేశాడు.. కొన్ని నెలలుగా పనుల్లేక పస్తులుంటున్నామని, తిండిలేక ఆకలితో అలమటిస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యాడు.

ఎన్నడూ లేనిది సిరిసిల్లలో ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీ, ప్రభుత్వ ఆర్డర్లు లేవంటూ పవర్ లూమ్స్ నిలిపివేయడంతో ఆసాములు తమకు పని కల్పించడం లేదని వాపోయాడు. కార్మికులు ఫుట్ పాత్ పై అడుక్కోవాలా?.. అని ప్రశ్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికుడితో మాట్లాడి కిందకు దింపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత.. బతుకమ్మ చీరల ఆర్డర్‌ ఆగిపోయింది. దీంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 12 మంది నేతన్నలు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్యలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version