ఇవాళ రాజమౌళి, మహేష్ బాబు సినిమా లాంఛ్ కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత, లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుని తన బాడీ మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ ప్రాజెక్కి మూడేళ్ల వరకు డేట్స్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజ మౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇవాళ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమం ఉంది.. హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో పూజా కార్యక్రమం ఉంటుందట.. జనవరి చివరి వారం నుంచి షూటింగ్ కానుంది.