తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక నెల వ్యవధిలోనే దాదాపు ఐదు మంది కానిస్టేబుల్స్ ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచారం. వీరి మరణాలకు వివిధ కారణాలున్నాయి.కొందరేమో అప్పుల బాధలు, మరికొందరు వివాహేతర సంబంధాల ఉచ్చులో ఇరుక్కుని ప్రాణాలు తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య సంచలనం రేపింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కిరణ్(36) మలక్‌పేటలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే, అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.