ఆర్.ఆర్.ఆర్ ఓపెనింగ్.. క్లాప్ కొట్టిన చిరంజీవి.. ప్రభాస్, రానా సర్ ప్రైజ్

-

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఈరోజు ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టి షూటింగ్ మొదలు పెట్టారు. రాఘవేంద్ర రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా సినిమాలో నటిస్తున్న ఎన్.టి.ఆర్, చరణ్ అటెండ్ అవగా.. ప్రభాస్, రానాలు కూడా ఈ సినిమా ముహుర్త కార్యక్రమానికి అటెండ్ అవడం జరిగింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ రామ రావణ రాజ్యం అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తుంది.

అట్టహాసంగా మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ లోనే ఇంటర్వల్ సీన్ షూట్ చేస్తారట. సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version